BDK: రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మణుగూరు తహసీల్దార్ నరేష్ సోమవారం ఓ ప్రకటనలు తెలిపారు. విద్యుత్ స్తంభాల కింద, భారీ వృక్షాల క్రింద, తడి ప్రదేశాలలో విద్యుత్ పరికరాలను తాకోద్దని సూచించారు. అత్యవసరమైతే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.