HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. దీనికోసం అధికారులు 407 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లను భద్రపరిచేందుకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్లను సిద్ధం చేస్తున్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.