ప్రకాశం: కనిగిరి వైసీసీ కార్యాలయంలో ఇవాళ ఉదయం 10 గంటలకు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ తెలిపారు. సమావేశం అనంతరం కార్యకర్తల కోసం రూపొందించిన ‘డిజిటల్ బుక్’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని వైసీసీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.