ప్రకాశం జిల్లాలో నిమ్మ రైతులు ఉసురుమంటున్నారు. నెలరోజుల క్రితం కేజీ నిమ్మకాయల ధర రూ.100 పలుకుతుండేది. ఈనెల 5వ తేదీ నాటికి రూ.15 పడిపోయింది. దీంతో నిమ్మ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టి సాగు చేశామని అకాల వర్షాలు తమను నిండా ముంచాయన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.