vzm: శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరపాలని, ప్రతి సాధారణ భక్తునికి చక్కటి దర్శనం లభించేలా ఏర్పాట్లను చేయాలనీ జిల్లా ఇంఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అధికారులు అందుకు తగ్గట్టుగా సన్నద్ధం కావాలని తెలిపారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డితో కలిసి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు.