అనకాపల్లి గవరపాలెంలో కొలువైన నూకాంబిక అమ్మవారిని విజయదశమి సందర్భంగా ముగ్గురు కలెక్టర్లు దర్శించుకున్నారు. విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్, అల్లూరి కలెక్టర్ దినేశ్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.