KDP: సిద్ధవటం మండలం భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న APSP 11వ పోలీసు బెటాలియన్లో మహాత్మా గాంధీ జాతిపిత జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ కే.వెంకట్ రెడ్డి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారత స్వాతంత్య్ర సాధనలో గాంధీజీ చేసిన త్యాగాల గురించి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ పోలీసులు పాల్గొన్నారు.