W.G: నరసాపురం మండలం తూర్పుతాళ్ల గ్రామానికి చెందిన కరీంశెట్టి శ్రీనివాస్ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మార్చురీలో మృతదేహాన్ని పరిశీలించి, ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.