AKP: అనకాపల్లి గవరపాలెం నూకాంబిక అమ్మవారికి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆదివారం పంచామృతాభిషేకం చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పూజలు చేశారు. రాష్ట్రంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.