ADB: షాహిద్ భగత్ సింగ్ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ పేర్కొన్నారు. AISF ఆధ్వర్యంలో నిర్వహించిన భగత్ సింగ్ 118 వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరూప చిత్రలేఖన పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు.