ప్రకాశం: సమాజంలో అసమానతలను తన కవిత్వం ద్వారా ఎత్తి చూపిన మహాకవి గుర్రం జాషువా అని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఇవాళ కనిగిరి పట్టణంలో కవి గుర్రం జాషువా 130 వజయంతి వేడుకలు బీసీ సంక్షేమ సంఘం, ఎస్సీ, ఎస్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. జాషువా విగ్రహానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఉగ్ర పూలమాలలు వేసి నివాళులర్పించారు.