భగత్ సింగ్, లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ ఉరి కంబం ఎక్కారని.. ఉరి కంబం ఎక్కే ముందు భగత్ సింగ్ ఆంగ్లేయులకు లేఖ రాశారని తెలిపారు. తనతోపాటు సహచరులను యుద్ధ బందీలుగా చిత్రీకరించారని లేఖలో పేర్కొన్నారని చెప్పారు. తమను ఉరి కంబానికి బదులు తూటాలతో చంపాలని భగత్ సింగ్ కోరారని వెల్లడించారు.