ELR: జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ అమ్మవారు శ్రీ మహా చండీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.