MDK: ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడిన ఒక మహిళకు తీవ్ర గాయాలైన ఘటన నిజాంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నిజాంపేట చెందిన కొమ్మాట పద్మ ఆదివారం తన భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అకస్మాత్తుగా కింద పడింది. వెంటనే స్పందించిన స్థానికులు 108 కు సమాచారం అందించడంతో 108 సిబ్బంది తీవ్ర గాయాలైన పద్మను ఆస్పత్రికి తరలించారు.