NLG: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మహిళా కూలి మృతి చెందిన ఘటన శనివారం రాజపేటలో చోటుచేసుకుంది. నకిరేకల్(M) గుర్రంకపల్లకి చెందిన సంపంగి అండాలు(50) భర్త తిరుపతితో కలిసి బతుకుదెరువు కోసం 15రోజుల క్రితం రాజపేటకు వచ్చి బండలు కొట్టి జీవనం సాగిస్తున్నారు. ఆమె మంచినీళ్ల కోసం వెళ్తుండగా, దారిలో అడ్డుగా ఉన్న తీగను పైకి లేపగా షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు.