కోనసీమ: రాయవరం మండలం పసలపూడి గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం పేకాట శిబిరంపై నిర్వహించిన దాడుల్లో 7గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై డి. సురేష్ బాబు తెలిపారు. వీరి నుంచి రూ.11,400 నగదు, ప్లాస్టిక్ టేబుల్, 6కుర్చీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మండలంలో ఎవరైనా జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.