VZM: శ్రీ పైడితల్లి అమ్మవారి తొలేళ్ళు, సిరిమానోత్సవంను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. బందోబస్తు, భద్రత ఏర్పాట్లను సమీక్షించేందుకు పోలీసు అధికారులతో శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అమ్మవారి దర్శనం, సిరిమానోత్సవంలో సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.