ADB: రైతులు, అమాయక ప్రజల నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారులపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కొరడా జులిపించారు. శుక్రవారం ఆదిలాబాద్, తలమడుగు, బజారహత్నూర్, బేల, ఇచ్చోడ, గుడిహత్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లో ఏకకాలంలో 43 బృందాలతో ఆకస్మిక దాడులు నిర్వహించారు. అధిక వడ్డీ వసూలు చేస్తున్న 18 మంది పై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.