KRNL: దసరా పండుగను పురస్కరించుకుని, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు మంత్రాలయం పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పండుగ ప్రశాంతంగా, శాంతియుతంగా జరగాలనే లక్ష్యంతో శుక్రవారం ఈ ప్రత్యేక తనిఖీలు జరిగాయి. ఎస్సై విజయ కుమార్ నేతృత్వంలోని పోలీస్ బృందాలు బాంబ్ స్క్వాడ్‌తో కలిసి పట్టణంలోని పలు ముఖ్య ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.