PPM: పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. ఆనంతరం తహసీల్దార్ ఎం.సురేష్ బాబు, సిబ్బందితో సమావేశం నిర్వహించి, అర్జీదారులకు ఉత్తమ సేవలు అందించాలని కోరారు. సమయపాలన పాటిస్తూ, విధులలో నిర్లక్షం వహించరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు పాల్గొన్నారు.