JGL: కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని మెడిసిన్ స్టోర్స్‌ను జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ వీ.ఉపేంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మెయిన్ స్టోర్స్‌లోని పలు రకాల మందుల స్టాక్ రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ తనిఖీల్లో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీత రాణి, డాక్టర్ వినోద్, డాక్టర్ రమేష్, ఫార్మసిస్టు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.