SKLM: నందిగాం మండలం గొల్లూరు గ్రామంలో శుక్రవారం సంతాన సాఫల్య శిబిరం స్థానిక సర్పంచ్ జీరు రాజేశ్వరి, మండల టీడీపీ నాయకుడు పినకాన అజయ్ కుమార్ ఆద్వర్యంలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.చంద్రశేఖర రావు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎల్డీఏ అధికారి డాక్టర్ పి.వి. శరత్ చంద్ర. నందిగాం మండల పశుసంవర్ధక అధికారి డాక్టర్ గురువెల్లి మన్మధరావు పాల్గొన్నారు.