ఫార్మా ఉత్పత్తులపై ట్రంప్ 100 శాతం టారిఫ్స్ ప్రకటించారు. దీంతో భారత్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ దాదాపు 8.7 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. USలో ఉపయోగించే జనరిక్ ఔషధాల్లో 45%, బయోసిమిలర్ ఔషధాల్లో 15% భారత్ సరఫరా చేసినవే. మన కంపెనీలకు 30-50శాతం రెవెన్యూ అమెరికా నుంచే వస్తోంది.