SKLM: పాతపట్నం మాజీ MLA రెడ్డి శాంతి క్యాంపు కార్యాలయంలో గురువారం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ మేరకు రెడ్డి శాంతి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ఓ ప్రకటన విడుదలైంది. గురువారం సాయంత్రం మూడు గంటలకు పాతపట్నంలో ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ఎల్ఎన్పేట మండలానికి చెందిన వైసీపీ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, ఇతర నాయకులు హాజరుకావాలని కోరారు.