E.G: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూ. గో.జిల్లా శాఖకు నూతన మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు అక్టోబరు 15న నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.కీర్తి చేకూరి తెలిపారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని PGRS హాల్లో కలెక్టర్ అధ్యక్షతన ఈ ఎన్నికలు జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వం ఉన్న పేట్రన్, వైస్ పేట్రన్, లైఫ్ మెంబర్స్ ఈ ఎన్నికలకు హాజరుకావాలన్నారు.