AP: బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుండటంతో మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఏపీపై వారం రోజులపాటు వాయుగుండం ఎఫెక్ట్ ఉండనుంది. ఈనెల 27న దక్షిణఒడిశా, ఉత్తరకోస్తాను వాయుగుండం తాకనుంది. 26 నుంచి 29వ తేదీ వరకు అతి భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.