ATP: గుత్తి ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే శానిటేషన్ వర్కర్లు బుధవారం వేతనాలు చెల్లించాలని ఆందోళన నిర్వహించారు. 4 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆది, వీరన్న, రాములమ్మ, రమాదేవి మాట్లాడారు. దసరా పండుగ దగ్గర పడిందని అయితే ఇంతవరకు జీతాలు రాలేదన్నారు. వేతనాలు చెల్లిస్తే దసరా పండుగ సంతోషంగా జరుపుకుంటామన్నారు.