ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. క్లాస్ రూంలో పరీక్ష రాస్తుండగా, 9వ తరగతి విద్యార్థుల మధ్య గొడవ మొదలైంది. ఆ క్రమంలో అది కాస్తా కత్తులతో పొడుకునే స్థాయికి చేరింది. మరోవైపు ఇదంతా టీచర్ ముందే జరుగుతుండటం విశేషం.
ఆ నేపథ్యంలో సాయి అనే విద్యార్థిని మరో స్టూడెంట్ శంకర్ చాకుతో పొడిచాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ క్రమంలో అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయుడు బాలుడిని వెంటనే రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘర్షణకు ప్రేమనే కారణమని తెలుస్తోంది.
దాడి చేసిన విద్యార్థి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని వివరాలు తెలుసుకుంటున్నారు. మరోవైపు గాయపడిన విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.