‘గత వైభవ’ అనే పీరియాడికల్ యాక్షన్ డ్రామాతో నటి ఆషిక రంగనాథ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని సింపుల్ సుని తెరకెక్కిస్తుండగా.. దుష్యంత్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ అప్డేట్ వచ్చింది. ఈ నెల 25న ఉదయం 11:11 గంటలకు టీజర్ విడుదల కానుంది. ఇక ఈ మూవీ ఈ ఏడాది నవంబర్ 21న థియేటర్లలోకి రాబోతుంది.