ELR: నూజివీడు పట్టణంలో ఈనెల 24న శ్రీనివాస్ సెంటర్లోని షాదీ ఖానాలో ‘లోక్ కళ్యాణ్ మేళా’ జరుగనుంది. పీఎం స్వానిధి పథకం కింద చిరు వ్యాపారులు, స్ట్రీట్ వెండర్ల నుంచి కొత్త రుణ దరఖాస్తుల స్వీకరణ, గతంలో మంజూరు కాని, ఎక్కువ రుణం కోరిన లబ్దిదారులకు మెప్మా ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తారని కమిషనర్ రామిరెడ్డి తెలిపారు.