GNTR: DSC నియామక పత్రాల జారీ కార్యక్రమ సభకు వచ్చే వాహనాల రాకపోకల మార్గాలను సోమవారం కలెక్టర్ తమీమ్ అన్సారీయా ఇతర జిల్లా ఉన్నతాధికారులతో కలసి స్వయంగా బస్సులో ప్రయాణించి పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండే విధంగా అవసరమైన చోట రహదారులను వెడల్పు చేయించడం, మరమ్మతులు చేయించడం వంటి పలు అంశాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.