KMR: బీర్కూర్-తిమ్మాపూర్ గ్రామాల శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో సోమవారం సాయంత్రం ఆలయ హుండీని లెక్కించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తుల ఆధ్వర్యంలో జూన్ 6 నుంచి సోమవారం వరకు వచ్చిన హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ.6,04,520 ఆదాయం వచ్చిందని ఆలయ కమిటీ సభ్యులు మద్దినేని నాగేశ్వరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట నరసరాజు, తిమ్మాపూర్ గ్రామస్థులు ఉన్నారు