BHPL: జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం జిల్లా SP కిరణ్ ఖారే మాట్లాడుతూ.. దసరా సెలవుల సందర్భంగా పిల్లల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువులు, కుంటల వద్దకు పిల్లలను ఈతకు పంపవద్దని, నిర్లక్ష్యం ప్రాణాంతకమవుతుందని ఆయన హెచ్చరించారు. పండుగ సీజన్లో క్షణిక నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీస్తుందని, జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.