NZB: భవన నిర్మాణ కార్మికుల పోరాట ఫలితమే లేబర్ ఇన్సూరెన్స్ పెంపు అని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు దుబాస్ రాములు అన్నారు. శుక్రవారం కోటగిరి మండల కేంద్రంలో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడు సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ డబ్బులు పెంచాలని అనేక ఉద్యమాలు చేపట్టామన్నారు.