»Tinmar Mallanna Gets Bail He Will Be Released From Jail Tomorrow
Malkjagiri court : తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ.. జైలు నుంచి రిలీజ్
తీన్మార్ మల్లన్న (Tinmar Mallanna) చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. గత నెల 21న పలు సెక్షన్ల కింద మేడిపల్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సాయి కిరణ్ గౌడ్ (Saikiran goud)కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ మల్కాజ్ గిరి కోర్టు (Malkjagiri court) సోమవారం తుది తీర్పు ఇచ్చింది. మల్లన్నతో పాటు అరెస్ట్ అయిన మిగతా నలుగురికి సైతం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
సీఎం కేసీఆర్ పోలీస్ సెక్షన్లను నమ్మాడని, తాము వీకర్ సెక్షన్స్ తో ఉన్నామని తీన్మార్ అన్నారు. తాను త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు. తన పార్టీ పేరు తెలంగాణ నిర్మాణ పార్టీ అని తెలిపాడు. చర్లపల్లి జైలు నుంచి విడుదలైన సందర్భంగా తీన్మార్ మల్లన్న ఈ కామెంట్స్ చేశారు. జైలు నుంచి విడుదలైన మల్లన్నకు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. చాలామంది ఫ్యాన్స్ మల్లన్నతో సెల్పీలు దిగేందుకు పోటీ పడ్డారు. తన కోసం పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. తీన్మార్ మల్లన్న(Tinmar Mallanna)కు హైదరాబాద్ మల్కాజ్ గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీన్మార్ మల్లన్నతో పాటు మరో నలుగురికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు…. ఒక్కొక్కరికి రూ.20 వేలు పూచీకత్తు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తీన్మార్ మల్లన్న జైలు నుంచి విడుదల అయినారు. తీన్మార్ మల్లన్నకు రెండు కేసుల్లో సాధారణ బెయిల్ ఇచ్చింది కోర్టు. బెయిల్ కోరుతూ తీన్మార్ మల్లన్న మల్కాజ్ గిరి కోర్టు (Malkjagiri court) లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గత నెలలో అరెస్ట్ అయిన తీన్మార్ మల్లన్న 28 రోజులు చర్లపల్లి జైల్లోనే(Charlapally Jail) ఉన్నారు.
ఈ క్రమంలో మల్లన్న బెయిల్ పిటిషన్ (Bail Petition) దాఖలు చేసుకోగా కోర్టు ఇరువైపుల వాదనలు విన్న అనంతరం మల్లన్న అండ్ టీమ్ కు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ పై తుది తీర్పును ఏప్రిల్ 17న ఇస్తామని గతంలో కోర్టు తెలిపింది.దీంతో ఇవాళ తుది తీర్పు ఇచ్చారు న్యాయమూర్తి. తీన్మార్ మల్లన్నపై తెలంగాణ(Telangana) వ్యాప్తంగా 90 కేసులు పెట్టారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా తన భర్తను అరెస్ట్ చేశారని మల్లన్న భార్య మమత ఏప్రిల్ 3న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా మల్లన్నపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదు అయ్యాయి. జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ను అరెస్ట్ చేసిన అనంతరం మేడిపల్లి పోలీసులు (Medipally Police) జడ్జి ఎదుట హాజరుపరిచ్చారు. తీన్మార్ మల్లన్నపై ఐపీసీ సెక్షన్లు 148, 307, 342, 506, 384, 109, r/w 149 కింద కేసులు నమోదు చేసినట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ కాపీ (FIR COPY) ని విడుదల చేశారు.సాయికరణ్ గౌడ్ (Saikiran goud) అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తీన్మార్ మల్లన్న కుటుంబసభ్యుల డిమాండ్ మేరకు ఎఫ్ఐఆర్ కాపీని మేడిపల్లి పోలీసులు విడుదల చేశారు.