HYD: మూసీని శుద్ధి చేసి HYDను సుందరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తేల్చిచెప్పారు. ప్రజాపాలన వేడుకల్లో మాట్లాడుతూ.. మూసీ చుట్టూ బతుకుతున్న ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని, మూసీని శుద్ధి చేసి కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తామన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మూసీ నదిని మారుస్తామన్నారు.