»High On Drugs Man Drags Traffic Cop On Cars Windshield For 10 Km In Maharashtra
Maharashtra: కారు బ్యానెట్‌పై ట్రాఫిక్ పోలీస్‌ను 20 కి.మీ. లాక్కెళ్లాడు
మద్యం మత్తు, మాదకద్రవ్యాలు సేవించిన మత్తులో ఓ వ్యక్తి తన కారుపై ట్రాఫిక్ పోలీసును దాదాపు పంతొమ్మిది కిలో మీటర్లు లాక్కెళ్లిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది.
మద్యం మత్తు, మాదకద్రవ్యాలు సేవించిన మత్తులో ఓ వ్యక్తి తన కారుపై ట్రాఫిక్ పోలీసును దాదాపు పంతొమ్మిది కిలో మీటర్లు లాక్కెళ్లిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది (on-duty traffic policeman on his car bonnet). నేవీ ముంబైలో ఈ సంఘటన కలకలం రేపింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో పోలీసులు కోపర్ ఖేరాణే – వాశి మార్గంలో డ్రంక్ అండ్ డ్రైవ్, సహా వివిధ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కారులో వెళ్తున్న ఓ వ్యక్తి మాదక ద్రవ్యాలు తీసుకున్నాడనే అనుమానంతో పోలీసులు కారును ఆపే ప్రయత్నం చేశారు. కారులోని డ్రైవర్ ను 23 ఏళ్ల బెంబ్డేగా గుర్తించారు. అతని కారును ఆపే ప్రయత్నం చేయగా… డ్రైవర్ ఆపకుండానే ముందుకు పోనిచ్చాడు. కారును ఆపే క్రమంలో ట్రాఫిక్ పోలీస్ 37 ఏళ్ల సిద్దేశ్వర్ మాలి ఆ కారు బ్యానెట్ పైన పడ్డాడు. అయినప్పటికీ అతను కారును ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. ట్రాఫిక్ పోలీస్ మాత్రం ఆ కారును గట్టిగా పట్టుకొని ఉన్నాడు. అలా ఇరవై కిలో మీటర్ల వరకు కారును పోనిచ్చాడు. గవ్హాన్ ఫాటా ప్రాంతానికి చేరుకున్న తర్వాత కిందపడిపోయాడు ట్రాఫిక్ పోలీసు. ఇతర పోలీసులు ఆ కారును వెంబడించారు. డ్రైవర్ బెంబ్డేను అదుపులోకి తీసుకున్నారు. అతను మాదక ద్రవ్యాలు సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. హత్యాయత్నం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్, మాదక ద్రవ్యాల చట్టం కింద ఆదిత్యపై కేసు నమోదు చేశారు.