అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొంతలం శివారు పాపంపేట గ్రామంలో అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో వున్నటువంటి హుండీని నిన్న రాత్రి తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దొంగిలించిన హుండీ తాళాలను పగలగొట్టి హుండీలోని డబ్బులు తీసుకొని కాళీ హుండీని గ్రామ శివారు పక్కన ఉన్న కాలువలో పడేసి వెళ్లిపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.