»Denied Ticket For Karnataka Polls Jagadish Shettar Quits Bjp
Jagadish Shettar : బీజేపీకి బిగ్ షాక్.. మాజీ సీఎం రాజీనామా
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార పార్టీ బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టర్ తనకు టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తనకు టికెట్ ఇవ్వలేదనే విషయాన్ని చివరి వరకు దాచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డేను కలిసి తన రాజీనామా సమర్పించారు.
Jagadish Shettar : మరికొన్ని రోజుల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు( karnataka assembly elections) జరగనున్నాయి. ఎన్నికల వేళ ఆ రాష్ట్రంలోని అధికార పార్టీ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టర్(Jagadish Shettar) తనకు టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తనకు టికెట్ ఇవ్వలేదనే విషయాన్ని చివరి వరకు దాచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే(Speaker Vishweshwar Hegde)ను కలిసి తన రాజీనామా సమర్పించారు. బీజేపీని వీడిన శెట్టర్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నారు. ఇది బీజేపీ(BJP)కి తీవ్ర నష్టం కలిగిస్తుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ పలువురు సీనియర్లను పక్కనబెట్టింది. 52 మందిని కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలోనే మాజీ సీఎం జగదీశ్ శెట్టర్తో పాటు మంత్రి అంగారాకు కూడా టికెట్ నిరాకరించింది. ఈ ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని షెట్టర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఏదైనా పార్టీలో చేరి పోటీ చేస్తారా.. లేదంటే స్వతంత్ర అభ్యర్థి(independent candidate)గా బరిలోకి దిగుతారా అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. కొద్ది రోజుల నుంచి బీజేపీ నేతలు తన పట్ల వ్యవహరిస్తున్న తీరు తనకు తీవ్ర అవమానకరమని అన్నారు.
బీజేపీ ఉన్నత స్థాయి వర్గాలు స్పందిస్తూ.. షెట్టర్ పార్టీ కన్నా తనకు తాను పెద్ద పీట వేసుకున్నాడని విమర్శించాయి. తాను పార్టీ కన్నా గొప్పవాడిననే భావంతో వ్యవహరించారని.. బీజేపీ పెద్దలు ఆయనతో మాట్లాడటానికి అనేకసార్లు ప్రయత్నించినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి, కర్ణాటక బీజేపీ ఎన్నికల ఇన్ చార్జ్ ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan), సీఎం బసవరాజ్ బొమ్మై(CM Basavaraj Bommai) శనివారం షెట్టార్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మరొ బీజేపీ కీలక నేత ప్రహ్లాద్ జోషీ కూడా పాల్గొన్నారు. హుబ్బళి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ విషయంలో షెట్టార్ అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ టికెట్లు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన పలువురు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఒకప్పటి జనతాపరివార్ కు చెందిన ప్రముఖ నేత బీ సోమశేఖర్ శనివారం నాడు రాజీనామా చేశాడు.