BDK: భద్రాచలం భగవాన్దాస్ కాలనీ, గోల్డ్ స్మిత్ కాలనీల సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి ఉదయం ముహూర్త పూజ, పాలకర్ర పాతడం వంటి సాంప్రదాయ కార్యక్రమాలు ప్రత్యేక పూజలతో నిర్వహించారు. దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 4 వరకు భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తామని వారు తెలిపారు.