భారత క్రికెట్ జట్టు యువ ఓపెనర్ పృథ్వీ షాకు (Indian cricketer Prithvi Shaw) బాంబై హైకోర్టు నోటీసులు జారీ చేసింది (Bombay High Court has issued a notice). సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్నా గిల్ వివాదం (social media influencer Sapna Gill row) నేపథ్యంలో పృథ్వీతో పాటు ప్రతివాదులు ముంబై పోలీసులకు (mumbai police) కూడా గురువారం నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. సప్నా గిల్ (Sapna Gill row) తన పిటిషన్లోని ఇతర ప్రతివాదులలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు అధికారులను పేర్కొన్నది. ఆమె తరఫు న్యాయవాది అలీ కాషిఫ్ ఖాన్ గురువారం జస్టిస్ ఎస్బి శుక్రే, ఎంఎం సతయేలతో కూడిన ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. సాక్ష్యం లేకుండా, భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్లు 384 మరియు 387 దోపిడీకి తన క్లయింట్ గిల్ పైన ప్రయోగించారని ఎత్తి చూపారు. అయితే దీనికి సంబంధించి తాము ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తామని ధర్మాసనం పేర్కొన్నది. లాయర్ అలీ కాషిఫ్ మాత్రం ఈ ఘటన అంతా పబ్ లోపల జరిగిందని, పోలీసులు అక్కడి నుండి సీసీటీవీ పుటేజీని యాక్సెస్ చేయలేదని పేర్కొన్నారు. పబ్ వెలుపల ఏం జరిగిందనే వీడియో మాత్రమే పోలీసుల వద్ద ఉందని, అందువల్ల సిసిటివి ఫుటేజీని భద్రపరచాలని కోర్టు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
ఫిబ్రవరిలో ముంబైలో ఓ స్టార్ హోటల్ లో పృథ్వీ షా – సప్నా గిల్ మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 17, 2023న పృథ్వీ షా, అతని స్నేహితులపై దాడి చేసినందుకు సప్నా గిల్, ఇతరులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఫిర్యాదుదారు… పృథ్వీ షా స్నేహితుడు తనపై చేసిన దాడి చేశాడని, అలాగే తనకు ప్రాపర్టీ నష్టం కలిగించాడని సప్నా గిల్ పిటిషన్ వేసింది. పృథ్వీ సూచనల మేరకు ఫిర్యాదుదారు తనను తప్పుడు కేసులో ఇరికించారన్నారు. తనతో ఉన్న వ్యక్తి సెల్ఫీ ఇవ్వమని అడిగినందుకు పృథ్వీ షా దురుసుగా ప్రవర్తించాడని, తనను అసభ్యంగా సప్నా గిల్ ఆరోపించారు. అతడిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు స్వీకరించడం లేదని ఏప్రిల్ మొదటి వారంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పృథ్వీషాతో పాటు పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరింది. ముంబై క్రికెటర్ తో పోలీసులు చేతులు కలిపారని, తన క్లయింట్ పైన తప్పుడు కేసు బనాయించారని సప్నా గిల్ తరఫు లాయర్ కోర్టుకు చెప్పారు.