మంత్రి విడదల రజనికి (minister vidadala rajini) అసమ్మతి సెగ కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (andhra pradesh assembly elections) ఆమెకు టిక్కెట్ ఇస్తే తాము సహకరించే ప్రసక్తి లేదని పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గానికి (Chilakaluripet Assembly constituency) చెందిన వైసీపీ అసమ్మతి నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు గుంటూరులోని (guntur) ఓ హోటల్ లో గురువారం పల్నాడు జిల్లా ఇంచార్జ్, ఎంపీ బీద మస్తాన్ రావును (beeda masthan rao) అసమ్మతి వర్గీయులు కలిశారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి (Chilakaluripet Assembly constituency) చెందిన పలువురు… ఎంపీని కలిసి రజనికి ఈసారి టిక్కెట్ ఇవ్వవద్దన్నారు. నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశానికి కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ఆమెనే ఉంటారని ఇటీవల ప్రకటించారని, ఆమెకే టిక్కెట్ ఇస్తే తాము సహకరించేది లేదన్నారు. ఇటీవల నియోకవర్గంలో జరిగిన మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో (maa nammakam nuvve jagan) విడదల రజనీయే మళ్లీ పోటీ చేస్తారని ప్రకటన చేశారు. ఇక్కడి నుండి ఆమెనే బరిలోకి దింపుతున్నట్లు స్పష్టమైన ఆదేశాలు తమకు ఉన్నాయని, ఈ విషయంలో ఎలాంటి అనుమానానికి తావులేదన్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోను ఆమెను బరిలోకి దింపితే ఊరుకునేది లేదని స్థానిక నేతలు నాదెండ్ల మాజీ ఎంపీపీ వీరారెడ్డి, కోవెలమూడి సాంబశివరావు తదితరులు అన్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ఆమెను మార్చకుంటే కనుక.. తామే స్వతంత్ర అభ్యర్థిని రంగంలోకి దింపుతామని హెచ్చరించారు. పార్టీకి సహకరించకుండా.. వ్యతిరేకంగా పని చేసే పరిస్థితి తీసుకు రావొద్దని చెప్పారు. ఎంపీ బీద వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారని తలుస్తోంది. ప్రత్యేక సమావేశం నిర్వహించి, సమస్య పైన మాట్లాడుదామని చెప్పినట్లుగా తెలుస్తోంది. అలాగే, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు.