ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. కాసేపట్లో బాంబు పేలుతుందని కోర్టులు బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కోర్టు కార్యకలాపాలు నిలిపివేశారు. బాంబ్ స్క్వాడ్, పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.