Mahesh - Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబుని దర్శక ధీరుడు రాజమౌళి ఎలా చూపించబోతున్నాడని.. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. ఈ సినిమాను ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కించబోతున్నాడు జక్కన్న.
సూపర్ స్టార్ మహేష్ బాబుని దర్శక ధీరుడు రాజమౌళి ఎలా చూపించబోతున్నాడని.. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. ఈ సినిమాను ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కించబోతున్నాడు జక్కన్న. ఆఫ్రికన్ అడవుల్లో మహేష్ బాబు చేయబోయే సాహసం గురించి ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. అయితే అసలు మహేష్ క్యారెక్టర్‌కు స్పూర్తి ఏంటి? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హనుమాన్ ఎంత పవర్ ఫుల్ గాడ్ అనేది అందరికీ తెలిసిందే. అందుకే రాజమౌళి తన హీరో పాత్రను హనుమంతుడి స్పూర్తితోనే పవర్ ఫుల్‌గా డిజైన్ చేస్తున్నాడట. మామూలుగానే రాజమౌళికి మన హిస్టరీ, పురాణాలు, రాజుల కాలం స్టోరీలంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే బాహుబలి, ట్రిపుల్ ఆర్ సినిమాలు వచ్చాయి. బాహుబలిలో మాహిష్మతి రాజ్యాన్ని సృష్టించిన జక్కన్న.. ట్రిపుల్ ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లను పాత్రలను బేస్డ్గా తీసుకొని.. అద్భుతమైన ఫిక్షనల్ స్టోరీ చెప్పాడు. ఇదే కాదు తన సినిమాలో ఉండే క్యారెక్టర్స్ ఎక్కువగా రామాయణ, మహాభారతాల నుంచి ప్రేరణగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే.. ఇప్పుడు మహేష్ బాబు పాత్రను హనుమంతుని నుంచి ప్రేరణగా తీసుకున్నట్లు చెబుతున్నారు. దాంతో హనుమాన్‌కి ఉన్న శక్తులు మహేష్ క్యారెక్టర్‌కు ఉంటాయని అంటున్నారు. అడవుల్లో జరిగే అక్రమాలపై మహేష్ బాబు పోరాటం ఉంటుందట. ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం మహేష్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది. మరి రాజమౌళి.. మహేష్ బాబుతో ఎలాంటి సాహసం చేస్తాడో చూడాలి.