CM Jagan : జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీలో బీసీ కుల గణనకు త్వరలో కమిటీ
జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ కుల గణన చేపట్టాలని నిర్ణయించింది. అందుకు సంబంధించి త్వరలోనే ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయనుంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ నేతృత్వంలో ఈ కమిటీని ప్రకటించనుంది.
god blessed me, once again i will be chief minister:JAGAN
CM Jagan : జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ కుల గణన చేపట్టాలని నిర్ణయించింది. అందుకు సంబంధించి త్వరలోనే ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయనుంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ నేతృత్వంలో ఈ కమిటీని ప్రకటించనుంది. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్(CM Jagan), మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, విడుదల రజిని(Vidutala Rajini) పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఇప్పటికే బీహార్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాల బీసీ గణనను చేపట్టాయి. అయితే.. ఆ రాష్ట్రాల్లో మంత్రి వేణుగోపాల్(Venugopal) కమిటీ అధ్యయనం చేయనుంది. రాష్ట్రంలోని బీసీ కేటగిరీలోని 139 కులాలకు మరిన్ని సంక్షేమ ఫలాలు అందించేందుకు బీసీ కులాల గణనను నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారని చెప్పారు.
ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలపై కమిటీ అధ్యయనం చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్టుగా మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు. ఈ కమిటీ సమర్పించిన నివేదిక అనంతరం రాష్ట్రంలో బీసీ కుల గణన(BC Caste Enumeration)కు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం సిద్దం చేయనుంది. దేశంలో బీసీల జనాభా 70 కోట్లు, మొత్తం జనాభాలో ఇది 56 శాతం అని అంచనా. 90 ఏళ్ల నాటి డేటా ఆధారంగానే కొనసాగుతున్న రిజర్వేషన్లు(Reservations). సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు నష్టపోతున్నాయి. కులాల లెక్కల తోనే బీసీల అసలు జనాభా తెలుస్తుంది. పదేండ్లకోసారి దేశంలో జనాభాను లెక్కిస్తున్నా.. ఓబీసీ తో పాటు ఏ ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారన్న సమగ్ర సమాచారం సేకరించడం లేదు. దీంతో ఈ మేరకు ఏపీ సర్కార్ త్వరలోనే బీసీ కుల గణను శ్రీకారం చుట్టనుంది.