కృష్ణా: మచిలీపట్నం సబ్ డివిజన్ ప్రజలకు పోలీసు వారు ఓ విజ్ఞప్తి చేశారు. మంగళవారం తలపెట్టిన ‘అన్నదాత పోరు’ కార్యక్రమ నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు తెలిపారు. మచిలీపట్నం సబ్ డివిజన్ వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున నిరసన కార్యక్రమాలకు, ధర్నాలకు, ర్యాలీలకు, సమావేశాలకు లాంటి అనుమతి లేవన్నారు.