అన్నమయ్య: అధికారులు నిర్లక్ష్యంగా పనిచేయడంతోనే మండలంలోని గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం మదనపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ.. అధికారులకు ప్రజా ప్రతినిధులకు సమన్వయం కుదరక, నిధులు ఉన్న పంచాయితీలలో అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు.