MDK: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మన ఉపాధ్యాయులందరికీ ఆదర్శమని ఎంఈవో నీరజ పేర్కొన్నారు. శుక్రవారం చేగుంట మండల కేంద్రంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్వేపల్లి రాధాకృష్ణ అందరికీ ఆదర్శంగా నిలిచారని, ఆయన బాటలో మనమందరం నడవాలన్నారు. చల్ల లక్ష్మణ్, వెంకటేష్, పాండు, విజయసేనారెడ్డి, మనోహర్ రావు పాల్గొన్నారు.