HNK: హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో ప్రభుత్వం అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఇచ్చే ప్రమాద బీమాను పెంచూతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల నాయకులు శుక్రవారం స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. కార్మిక సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు యమడాల అనుకాంత్ ఆధ్వర్యంలో కార్మికులు పట్టణంలోనే కార్మిక అడ్డాలో స్వీట్లు పంపిణీ చేశారు.