TG: ‘ధరణి’తో పట్టుకున్న దరిద్రాన్ని.. ‘భూభారతి’తో తొలగించే ప్రయత్నం చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలకు రెవెన్యూ అధికారుల వల్ల సమస్యలు రాలేదని.. ధరణి వల్లనే సమస్యలు వచ్చాయని సీఎం అన్నారు. ఏ వ్యవస్థలోనైనా 5 శాతం తప్పులు జరిగే అవకాశం ఉంటుందని, అయితే ఆ తప్పుల కారణంగా మొత్తం వ్యవస్థనే రద్దు చేస్తామా? అని ప్రశ్నించారు.